Election Updates: దళితులకు ఊహించని షాక్.. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేత..

Unexpected shock for Dalits.. Dalit Bandhu Scheme will be temporarily suspended..
Unexpected shock for Dalits.. Dalit Bandhu Scheme will be temporarily suspended..

తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సంక్షేమ పథకాలు అన్నిటికీ బ్రేక్ పడింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ములుగు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఒక బోర్డు పెట్టారు.

గమనిక పేరుతో ఎన్నికల నియామవళి 2023 అమలులో ఉన్నందున దళిత బంధువు మరియు ఇతర పథకాలు తాత్కాలికంగా నిలిపివేయడమైనది అని రాసి ఉంది. ఇక అది చూసిన ప్రజలు నిరాశతో వెను తిరుగుతున్నారు. కాకా దళిత బంద్ కింద ప్రభుత్వం అర్హులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా దళిత బంధు ఆపేయాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానున్నాయి.