Election Updates: నేడు సీఎం కేసీఆర్ మంత్రులతో ప్రగతి భవన్ లో కీలక సమావేశం

Election Updates: KCR narrowly missed an accident..
Election Updates: KCR narrowly missed an accident..

నేడు హరీశ్‌రావు, కేటీఆర్ లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించాలన్నారు. అసంతృప్త నేతలను ఎన్నికలకు ముందే పార్టీలోని బుజ్జగించడం, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తులపై కేసీఆర్ వారితో సమాలోచనలు జరపనున్నారు. ఎవరిని ఎలక్షన్స్ ఇన్ చార్జ్ లుగా ఎక్కడ నియమించాలనే అంశంపైన చర్చించనున్నారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణలో ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ముందు నుంచే బలంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక షెడ్యూల్ విడుదల తర్వాత ప్రచారంలో జోరు మరింత పెంచింది. ముఖ్యంగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు సుడిగాలి పర్యటనలు చేస్తూ, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓవైపు కార్యకర్తల్లో జోష్ పెంచుతూ, మరోవైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.