తిరుమలలో సందడి చేసిన విజయ్ లియో మూవీ టీమ్ ..!

తిరుమలలో సందడి చేసిన విజయ్ లియో మూవీ టీమ్ ..!
Latest News

ప్రస్తుతం సౌత్ ఇండియా మూవీ ల లో క్రేజీ హైప్ లో ఉన్న పలు చిత్రాల్లో తమిళ అవైటెడ్ చిత్రం “లియో” కూడా ఒకటి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే హీరో విజయ్ ల కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కోసం అంతా ఆసక్తి గా ఎదురు చూస్తుండగా తాజాగా అయితే ఈ చిత్ర యూనిట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సహా సినిమా యూనిట్ కొందరు సభ్యులు మూవీ విజయం సాధించాలి అని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల సన్నిధిని చేరారు.

తిరుమలలో సందడి చేసిన విజయ్ లియో మూవీ టీమ్ ..!
Leo Team

దీనితో అక్కడ విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా లో త్రిష హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ మరియు యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా లు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించాడు. మరి 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది.