ఈ ఏడాది సంతోషం లేదు….ఎందుకురా ?

this year no happiness says swarnalatha

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తన వద్దకు వచ్చేవారు సంతోషంతో కాక దుఖంతో వస్తున్నారని స్వర్ణలత రంగంలో తెలిపారు. ఏటా భక్తులు తనవద్దకు సంతోషంగానే వస్తున్నారని, అయితే ఈసారి మాత్రం సంతోషం లేకుండా పోయిందెందుకని ఆలయానికని వచ్చే ఆడపడుచులు బాధ పడుతూ వెళుతున్నారని, ఈ సంగతిని ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మహిళల సౌకర్యం కోసం ఆలయంలో ఎంతో చేస్తున్నామని సంతోషం లేదంటే తామంతా ఏమై పోవాలని ప్రశ్నించగా, “నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయిరా బాలకా… ఏం మాట్లాడుతున్నావురా బాలకా నువ్వు? ప్రత్యక్షంగా నీ కళ్లతో చూసి చెప్పు” అంటూ స్వర్ణలత ప్రశ్నించింది.

ఇటీవలి కాలంలో హిందూ మతాన్ని, హైందవ జాతిని కించపరుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉందని, ఇటువంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తావని స్వర్ణలతను ప్రశ్నించగా “తాను న్యాయం పక్షానే నిలుస్తానని, ఎవరెన్ని మాటలన్నా జాతికి రక్షగా నేనుంటా. తప్పనిసరిగా శిక్షిస్తానని చెప్పింది. గ్రీష్మ రుతువు దాటినా వర్షాలు లేవని, ఎందుకు వర్షాలు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించగా, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తన ప్రజలు సుఖంగా ఉంటేనే తనకు సంతోషమని వ్యాఖ్యానించింది. దాంతో ఈ సంవత్సరం రంగం ఘట్టం ముగిసింది.