పోలీసులను ఆశ్రయించిన శ్రీరెడ్డి

Sri Reddy files case against on actor Varahi

శ్రీరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. మొన్నటి వరకు తెలుగు సినీ పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసి, తెలుగు సినీ ప్రముఖులకు చెమటలు పట్టించిన శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా తమిళ సినీ ప్రముఖులపై పడ్డ విషయం తెల్సిందే. తెలుగు సినీ పరిశ్రమ వారి మాదిరిగా తమిళ సినీ ప్రముఖులు శ్రీరెడ్డి వ్యాఖ్యలకు చేతులు ముడుచుకుని కూర్చోవడం లేదు. ఎవరిపై ఈమె ఆరోపణలు చేస్తుందో వారిపై కేసు పెట్టాలని, లేదంటే సాక్ష్యాధారాలను ముందు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమ పరువు తీసేలా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ శ్రీరెడ్డికి చాలా మంది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డిపై తమిళ దర్శక నిర్మాత వారాహి సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీరెడ్డి ఒక వ్యభిచారి అని, ఆ విషయాన్ని ఆమె పలు సార్లు ఒప్పుకుందని, అవకాశాల కోసం వారి వద్ద వీరి వద్ద పడుకున్నట్లుగా చెప్పిన ఆమెను వ్యభిచారి అనకుండా ఏమంటారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో శ్రీరెడ్డి రివర్స్‌గా వారాహిపై కేసు పెట్టడం జరిగింది.

తనను మీడియా ముందు వ్యభిచారి అంటూ దూషించాడు అంటూ వారాహిపై కేసు పెట్టింది. తనకు ఏ ఒక్కరు, ఎప్పుడు డబ్బు ఇచ్చింది లేదని, కనీసం నన్ను వాడుకున్న వారు నాకు ఒక్క పూట భోజనం కూడా పెట్టించలేదని చెప్పుకొచ్చింది. నన్ను వ్యభిచారి అంటూ పిలిచిన వారాహికి నాతో పడుకున్న వారిని వ్యభిచారులు అంటూ పిలిచే దమ్ము ఉందా అంటూ గతంలో ప్రశ్నించింది. ఈ వివాదంను వారాహి కొనసాగిస్తున్న కారణంగా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఆయన మాట్లాడుతున్నాడు అంటూ శ్రీరెడ్డి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలను ఇంకా పలువురు తమిళ సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. అయితే వారు మాత్రం వారాహి స్థాయిలో శ్రీరెడ్డిపై విమర్శలు చేయలేదు. దాంతో శ్రీరెడ్డి ఇప్పుడు పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.