తిరుపతి అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి వేదికైంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీష్, గోవా సీఎం ప్రమోద సావంత్ హాజరైన సమ్మేళనం మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగా ఆలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు జరుగుతున్నాయి. దాదాపు 57 దేశాల్లోని 1600 దేవాలయాలను ఒకే వేదికకు అనుసంధానం చేస్తూ ఏర్పాట్లు చేశారు.