Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతి ని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని చేయాలని కలలు కంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకి అక్కడే ఘోర అవమానం జరిగింది. సచివాలయ ఉద్యోగులు కొందరు ఆయన పట్ల కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు. సాక్షాత్తు ప్రభుత్వ అధినేత ఫోటోని డస్ట్ బిన్ లా వాడేశారు.
సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో నేడు ఉన్నత విద్యాశాఖ అధికారుల భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. సమావేశం తర్వాత ఆ అధికారులు తాము టిఫిన్ చేసిన ప్లేట్స్ ని అక్కడే ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం చంద్రబాబు ఫోటో మీద పడేసారు. ఇది పొరపాటుగా జరిగి ఉంటుందని కొందరు అంటుంటే కావాలనే అలా చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి మ్యాటర్ సీరియస్ అయ్యేట్టు వుంది.