రజనికి కూడా పార్టీ సెట్ చేస్తున్న కమల్.

kamala-hassan-advising-party-for-rajinikanth

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఇంకా సొంత పార్టీ ఎత్తకుండానే, రాజకీయాల్లో నేరుగా ఓనమాలు దిద్దకుండానే కమల్ హాసన్ కి ఆ రంగానికి అవసరమైన చాలా విద్యలు వచ్చేసాయి. రావడమే కాదు వాటిని ప్రదర్శించేస్తున్నారు ఆయన. పార్టీ ప్రకటన ఒక్కటే మిగిలినంతగా తమిళ రాజకీయాలపై ఎడాపెడా ప్రకటనలు గుప్పిస్తున్న కమల్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ని కూడా టార్గెట్ చేశారు. రజని తమిళుడు కాకపోయినా ఆయన్ని వెండితెర మీద ఎదుర్కోవడం అచ్చమైన ఆరవ తంబీ కమల్ కి కష్టం అయిపోయింది. సరే సినిమాల్లో స్టార్ డమ్ విషయంలో కాస్త అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే రజని ఏకంగా రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంటే తట్టుకోలేకపోయారు కమల్. అందుకే అర్జెంట్ గా రాజకీయాల మీద స్టేట్ మెంట్స్ ఇచ్చారు. సొంత పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తమిళనాట అవినీతిని ప్రక్షాళన చేస్తానంటూ ప్రస్తుతం ఉన్న పార్టీల మీద నిప్పులు చెరుగుతున్నారు.

కమల్ హడావిడి పెరిగాక రజని కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సున్నితమనస్కుడైన రజని ని ఇంకాస్త టెన్షన్ పెట్టడానికి అన్నట్టు కమల్ రెచ్చిపోతున్నారు. ఓ వైపు తనకు రజని తనకు మంచి మిత్రుడు , ఆయనకి తాను పార్టీ పెడుతున్న విషయం చెప్పాను అంటూనే ఇంకో వైపు ఆయనకి చురకలు వేస్తున్నాడు. తమిళ రాజకీయాల్లోకి ఏదో రకంగా పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీ ప్రస్తుతం అన్నాడీఎంకే మీద దృష్టి పెట్టింది. అయితే రజని లాంటి మాస్ పల్స్ పట్టగలిగిన నాయకుడు వారికి కావాలి. అందుకే ఆయన కోసం వారు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కమల్ మాత్రం బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. బీజేపీ ప్రయత్నాలకు చురక వేసేందుకు ఆయన రజని పేరు ముందుకు తెచ్చారు. సహజంగానే ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న రజని కి బీజేపీ సరైన పార్టీ అని కమల్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ గురించి చెప్పకుండా రజనికి ఇంకో పార్టీ ని అంటగట్టడానికి కమల్ చేస్తున్న ప్రయత్నం విమర్శలకి గురి అవుతోంది.