ట్రాక్టర్ లోకి ఎగిచి దుమికిన పులి.. రైతులపై దాడి.

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ట్రాక్టర్ పై పొలానికి వెళ్తున్న రైతులమీద పులి విరుచుకు పడింది. ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో చోటు చేసుకుంది. తమ పొలంలోని ధాన్యాన్ని తీసుక వచ్చేందుకు రామ్ బహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్‌లు ట్రాక్టర్‌పై బయలుదేరారు. అయితే ఇదే సమయంలో అదే దారిలో చెట్ల పొదల్లో ఆవురావురు మంటూ వేచి చూస్తున్న పులి ఒక్కసారిగా ట్రాక్టర్‌పైకి దుమికింది. ఆ తర్వాత వారిపై దాడికి యత్నించింది.

అయితే వెంటనే మేలుకున్న రైతులు కర్రలతో పులిపై దాడికి దిగడంతో భయంతో పులి అడవి పొదల్లోకి పరుగులు తీసింది. దీంతో రైతులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

అదేవిధంగా రైతులకు దైర్యం వచ్చి అక్కడి నుంచి పులిబారి నుంచి తప్పించుకున్నారు. కాగా పులి దాడిలో కాస్త గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకొని పులిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం అందుతుంది.