ఈ చిత్రానికి ‘శేషాచ‌లం’ అనే టైటిల్ ఫిక్స్

ఈ చిత్రానికి ‘శేషాచ‌లం’ అనే టైటిల్ ఫిక్స్

సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ర‌ష్మిక క‌థానాయిక‌. ఈ చిత్రానికి ‘శేషాచ‌లం’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగే క‌థ ఇద‌ని, అందుకే ఆ టైటిల్ పెట్టార‌ని ప్ర‌యారం జ‌రుగుతోంది. దీనిపై చిత్ర‌బృందం స్పందించింది. బ‌న్నీ సినిమాకి ఇంత వ‌ర‌కూ టైటిల్ ఏదీ నిర్ణ‌యించ‌లేద‌ని, త్వ‌ర‌లోనే టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ‘కొన్ని వెబ్ సైట్ల‌లో, దిన ప‌త్రిక‌ల‌లో టైటిల్ గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిలో నిజం లేదు. టైటిల్‌కి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు” అని నిర్మాత‌లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే బ‌న్నీ సినిమా కొత్త షెడ్యూల్ మొద‌లుకానుంది. ఆమ‌ధ్య కేర‌ళ‌లో బ‌న్నీ లేకుండానే కొన్ని రోజులు షూటింగ్ జ‌రిపారు. ఈ షెడ్యూల్‌లో బ‌న్నీ కూడా అడుగుపెట్ట‌బోతున్నాడు. అన‌సూయ ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నుంది.