పవన్ కళ్యాణ్ నుంచి రాని గ్రీన్ సిగ్నల్

పవన్ కళ్యాణ్ నుంచి రాని గ్రీన్ సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే టైటిల్ ఇతర సినిమాలలో ఈ మధ్య కాలంలో పడింది.కానీ తనదైన సినిమాకు మాత్రం ఈ టైటిల్ నోచుకోలేదు.”అజ్ఞ్యాతవాసి” చిత్రం తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లో బిజీ అయ్యిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి మళ్ళీ తాను చెప్పిన మాట తప్పక తప్పడం లేదు.ఒక్క పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఇంక సినిమా ఎప్పుడు మొదలు పెడదామా అని నిర్మాత “దిల్” రాజు ఎవర్ రెడీగా ఉన్నారు.

కానీ కళ్యాణ్ నుంచి ఎలాంటి సిగ్నల్ ఇంకా రావడం లేదు.ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ “పింక్” రీమేక్ సహా క్రిష్ తో మరో సినిమాలో నటిస్తున్నారని వార్తలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి.వీటిపై ఇప్పుడిప్పుడే పవన్ అభిమానులు కాస్త నిజాలు తెలుసుకుంటున్నారు.ఇన్నాళ్లు పవన్ సినిమాలు చెయ్యరు అన్న వాదన నుంచి తప్పుకుంటున్నారు.అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ జనవరి 20వ తారీఖునే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని గట్టి బజ్ వినిపిస్తుంది.