కోదండరాం ఎక్కడ ఫెయిలౌతున్నారు..?

tjac-chairman-prof-kodandaram-feeling-in-telangana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆయన ఉద్యమ సమయంలో పెద్దదిక్కుగా ఉన్నారు. విభిన్న సిద్ధాంతాలున్న పార్టీల్ని ఒక్కతాటిపైకి తెచ్చారు. ముఖ్యంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలను కూడా ఏకతాటిపైకి తెచ్చి.. ఉద్యమించారు. కేసీఆర్ వల్ల కూడా కాని పని కోదండరామ్ తో సాధ్యమైంది. జేఏసీ ఏర్పాటు తర్వాతే తెలంగాణ ఉద్యమం ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు ఢిల్లీ కూడా తెలంగాణ బిల్లు తయారీ సమయంలో కేసీఆర్ తో పాటు కోదండరాంను కూడా పిలవాల్సి వచ్చింది.

అంత స్ట్రాంగ్ మ్యాన్ కోదండరాం ఇప్పుడు చీప్ గా తయారయ్యారు. ఆయన ప్రతి చిన్న దానికీ యాగీ చేస్తున్నారని జనం కూడా అనుకుంటున్నట్లు తేలడంతో.. విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. కేసీఆర్ పై వ్యతిరేకత లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక పాలుపోని పరిస్థితి. చివరకు అంతగా ప్రాధాన్యం లేని ధర్నాచౌక్ తరలింపు విషయంలో కూడా అనవసర రచ్చ చేసి హస్తినలో పరువు తీశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తారో.. లేదో కూడా డౌట్ గా మారిన తరుణంలో.. కోదండరాంను ఎగేస్తున్నారని జనం అనుకుంటున్నారు. అయితే ఓయూ విద్యార్థులు మాత్రం ఉద్యోగాల విషయంలో కేసీఆర్ పై కోపంగానే ఉన్నారు. మరి వారిని ఎలా కూల్ చేస్తారో చూడాల్సిందే. ఇప్పుడు ఎవరికి కేసీఆర్ పై కోపం ఉన్నా.. కోదండరామ్ కు ఓటేసే ప్రసక్తి మాత్రం ఉండదు. కోదండరాం లాంటి వాళ్లు ఉద్యమాలకే పనికొస్తారు కానీ.. పాలనకు పనికిరారని జనం ముఖం మీద చెప్పక ముందే.. కోదండరామ్ పరువు నిలబెట్టుకునే పనులు చేయాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు:

విజయసాయికి మైండ్ పోయింది …పాలిటిక్స్ లోతు తెలిసొచ్చింది.

అవును..అత‌ను మా దేశంలోనే ఉన్నాడు

కోర్టు హాలు నుంచి త‌ప్పించుకునేందుకు ప‌న్నాగం…ఎర్ర‌బ్యాగుతో డేరా బాబా సంకేతాలు