గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగార ధర తగ్గింది. దేశీ మార్కెట్లో శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.32,970కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.38,750 వద్ద నిలకడగానే కొనసాగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ నిలకడగానే ఉండటం ఇందుకు కారణం. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం ఔన్స్‌కు 0.67 శాతం పెరుగుదలతో 1,288.30 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 1.06 శాతం పెరుగుదలతో 15.03 డాలర్లకు పెరిగింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.32,970కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.32,800కు క్షీణించింది.