ఇస్రో సంస్థ….మరో ప్రయోగానికి సిద్ధమైంది. నేడు ఇస్రో సంస్థ గగన్‌యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ ప్రయోగం చేయనుంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో సంస్థ ప్రయోగించనుంది.
రాకెట్ శిఖర భాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను భూమికి 17 కిలోమీటర్ల మేర పైకి రాకెట్ పంపనుంది. అనంతరం పారాచూట్స్ సాయంతో బంగాళాఖాతంలోకి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగనుంది. కాగా, ప్రపంచంలోనే జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే 14 రోజుల పాటు చంద్రయాన్-3లోని ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి.