నేడు ఎన్టీఆర్‌ రూ.100 నాణెం ఆవిష్కరణ..!

Today NTR unveiled Rs.100 coin..!
Today NTR unveiled Rs.100 coin..!

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడుగా ,టీడీపీ వ్యవస్థాపకులుగా, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా, స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకుని తన నటనతో మెప్పించడమే కాకుండా, సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఆ మహనేత శత జయంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద వంద రూపాయలు నాణెం ముద్రించింది.

ఎన్టీఆర్‌ గారు జన్మించి.. ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి కావడం విశేషం. ఆయన శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబంతోపాటూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ పేరిట 100 రూపాయల నాణేన్ని ఆయన గౌరవార్ధం ఇవాళ ఆగస్టు 27న(సోమవారం)విడుదల చేస్తోంది.

రాష్ట్రపతి చేతుల మీదుగా..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఈ నాణేన్ని విడుదల చేస్తారని తెలిసింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. నందుమూరి కుటుంబానికి కూడా ఆహ్వానం అందింది. ఈమేరకు ఎన్టీఆర్‌ కుటుంబీకులు నందమూరి బాలకృష్ణ,బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి,ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారు.

పంచలోహాలతో నాణెం..

ఈ నాణెం 100 శాతం లోహాలతో ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా తయారు చేయడం విశేషం. 44 మిల్లీమీటర్ల ఈ నాణెంలో 50 శాతం సిల్వర్‌ (వెండి), 40 శాతం కాపర్‌ (రాగి) మిగతా 5, 5 శాతాల్లో నికెల్, జింక్‌ లోహాలతో ఉండి.. సరిగ్గా 100 శాతం లోహాలతో తయారయ్యేలా చేశారట. నాణేనికి ఓ వైపు ఎన్టీఆర్‌ చిత్రం ఉండగా మరోవైపు 3 సింహాలతోపాటు అశోక చక్రం, దాని కింద నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు.

హైదరాబాద్‌లో తయారీ..

ఈ నాణేన్ని హైదరాబాదులోని మింట్‌ కాంపౌండ్‌లోనే ముద్రించారు. 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్‌ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులకే స్వయంగా సెలెక్ట్‌ చేసుకునే అవకాశం కల్పించారని తెలిసింది. ఈ 100 రూపాయల నాణెం నందమూరి తారక రామారావు రూపంతో ముద్రించడం పట్ల నందమూరి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు.