నేటి నుండే పార్లమెంట్…కానీ రెండ్రోజులు ?

today onwards parliament

పదిహేడో లోక్‌సభ సమావేశాలు నేటి నుండి సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు మొదలైన సమావేశాలు జూలై 26వరకూ జరగనున్నాయ. ఈ సమావేశాలలో తొలి రెండు రోజులు లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 19న కొత్త స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వీరేంద్ర కుమార్ 1996 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి జరిగిన ఆరు లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. మేనకాగాంధీ స్పీకర్‌గా ఎన్నికవ్వ వచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఇక జూలై 4న ఆర్థిక సర్వే, 5న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు అనంతరం బడ్టెట్‌పై చర్చ ప్రారంభమౌతుంది. పార్లమెంట్‌ సమావేశాలు 39 రోజుల పాటు జరగనున్నాయి. అందులో 31 రోజులు సభా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. వ్యవసాయ సంక్షోభం, రైతాంగ సమస్యలు, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, దళిత, మైనార్టీ, మహిళలపై దాడులు, సమాఖ్య వ్యవస్థపై దాడి, రాజ్యాంగ సంస్థలపై దాడి, కరవు, మీడియా స్వేచ్ఛ, మహిళల భద్రత, ధరలు ఇతర అంశాల మీద పార్లమెంట్ చర్చించనుంది.