లోక్ సభ ప్రతిపక్షం మీద వీడని సస్పెన్స్ ?

Suspension of the Lok Sabha on the Opposition

17వ లోక్‌సభ తొలి సమావేశం ఏఒర్జు నుంచి ప్రారంభమవుతున్నా సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అలాగే సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసుకునే విషయంలోనూ ఇప్పటి దాకా ముందడుగు పడలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశమే జరగలేదు. దీనిపై కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ చాలా ప్రతిపక్ష పార్టీలు సభలో తమ పార్టీ పక్ష నాయకుడిని ఎంపిక చేయలేదనీ, ఆ పని పూర్తయిన అనంతరం ప్రతిపక్ష పార్టీల భేటీ ఉండొచ్చని అన్నారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆధిర్‌ రంజన్‌ చౌధురీ, కేరళ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్‌ హాజరయ్యారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా నియమించే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ, ఎదురుగాలిలోనూ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్‌ తరఫున గెలిచిన శశి థరూర్‌ల పేర్లు కూడా ఈ రేసులో ఉన్నాయి. నిజానికి లోక్‌సభలో ఏ పార్టీకైనా ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే మొత్తం స్థానాల్లో కోరం సభ్యుల ను కలిగి ఉండాలి. అంటే ఎన్నికలు జరిగిన 542 స్థానాల్లో కనీసం 10 శాతం (54)మందికిపైగా సభ్యులను కలిగి ఉన్న పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇటీవలి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్‌ పార్టీకే మిగతా పార్టీల కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. 52 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన కాం గ్రెస్‌ పార్టీకి స్వతంత్రంగా ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఎలా ముందు కుసాగుతాయన్నది ఇంకా సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.