నేడు చంద్రగ్రహణం అన్న సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం 8 గంటల పాటు మూసివేయనున్నారు టీటీడీ అధికారులు. ఇవాళ ఆలయాన్ని రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 3:15 గంటల వరకు మూసివేయనున్నారు. ఇక ఇవాళ వికలాంగులు, సహస్రదీపాలంకరణ సేవ, వయోవృద్దుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ…శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించారు.
గ్రహణ సమయం లో చేయకూడని పనులు….
* గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకూడదు.
* గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.
* గ్రహణకాలంలో పూజలకు దూరంగా ఉండాలి.
* కూరగాయలు తరిమేందుకు కత్తి వంటి సాధనాలను దూరంగా ఉంచాలి.
* గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి.
* ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే 15 రోజులు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటించాల్సి దేనని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు.. ఈ రూల్స్ పాటించాలట.