Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తాగి తూగుతూ వాహనాలు నడపవద్దు అలా నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఎంత పెద్దవారు అయిన వదిలిపెట్టము అని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు మాత్రం చేతులారా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ మద్య కాలంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్-బంజారాహిల్స్ పరిధులలో డ్రంకెన్ డ్రైవ్లో పెద్ద ఎత్తున సెలబ్రెటీలు, పొలిటీషియన్స్, డాక్టర్, పారిశ్రామిక వేత్తలు అడ్డంగా బుక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య యాంకర్ ప్రదీప్ కూడా డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అదే తరహాలో మరో నటుడు కూడా తాగి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. తాజాగా శనివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 96 మంది పట్టుబడ్డారు.
ఈ తనిఖీల్లో టాలీవుడ్ నటుడు కిరీటి దామరాజు అడ్డంగా బుక్కయ్యారు. నటుడు కిరీటి దామరాజు ఉయ్యాలా జంపాలా, సెకండ్ హ్యాండ్, మీకు మీరే మాకు మేమే, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా తదితర చిత్రాల్లో గుర్తింపు వచ్చే పాత్రల్లో నటించారు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కాహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు బుక్ చేశారు. ‘ఏపీ 09 సీపీ 6893’ నంబర్ గల కారులో వచ్చిన అతను మద్యం తాగి ఉన్నాడని గమనించిన పోలీసులు, తొలుత కారు నుంచి దిగాలని సూచించడంతో కారు దిగాడు. ఆపై కూర్చుని మాట్లాడుకుందామని ఓ అధికారి చెప్పడంతో డివైడరు పైనే కూర్చున్నాడు. కాసేపటికి ఆయాన వేరే వాహనంలో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దామరాజుకు సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహించి, మంగళవారం నాడు కోర్టుకు తీసుకెళ్లనున్నామని అన్నారు. నటించారు. ఈ తనిఖీల్లో భాగంగా 39 కార్లు, 57 ద్విచక్రవాహానను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిపై కేసులు నమోదు చేశారు.