వెండితెరపై మెరిసే తారలు అందరూ ఒకే వేదికపై కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ నిన్న ఒక వేడుక కోసం అందరూ కలిశారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘సినీ మహోత్సవం’ అనే ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ ఉత్సవంలో తెలుగు సినీ తారలు తమ ఆట పాటలతో ఆద్యంతం అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరైయారు.
ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ తనదైన పెర్ఫార్మన్స్ తో దుమ్మురేపగా చిరంజీవి మహేష్ బాబులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ వేడుకలో జయసుధ, జయప్రద, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, రకుల్, పూజా హేగ్డే, లావణ్య త్రిపాఠి, బివిఎన్ ప్రసాద్, బోయపాటి సుమలత, జీవితలు సందడి చేశారు. ఇక ఈ వేడుక మీద అనసూయ. పూజా హేగ్దేలు తమ నాట్యంతో అలరించారు. ఇక ఈ వేడుక సందర్భంగా సీనియర్ నటులు మురళీమోహన్, కృష్ణంరాజు, గిరి బాబు, గీతాంజలిలకి సన్మానం కూడా నిర్వహించారు. అయితే ఈ వేడుక ఎప్పుడు ప్రచారం చేయనున్నారో ఇంకా క్లారిటీ లేదు