ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.ఇటీవల టాలీవుడ్లో యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఆ జాబితాలో తీన్మార్ బ్యూటీ కృతి కర్బందా కూడా చేరింది. తన కో స్టార్, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో కృతి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఆమె మెడలో పుల్కిత్ సామ్రాట్ మూడు ముళ్లు వేశారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. హరియాణాలోని మనేసార్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పంజాబీ స్టైల్లోగ్రాండ్ గా జరిగింది.
ఇక వీరిద్దరూ ఒకరోజు ఆలస్యంగా తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నా గుండె కొట్టుకునేది నీ కోసమే.. ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలంటూ కృతి కర్బందా క్యాప్షన్ రాసింది . పెళ్లిలో కృతి.. పింక్ లెహంగాలో మెరిసిపోయింది. పులకిత్.. లేత ఆకుపచ్చ రంగు షేర్వాణీలో రాకుమారుడిగా కనిపిస్తున్నాడు.కాగా, ఈమె తెలుగులో తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D, బ్రూస్లీ వంటి మూవీ ల్లో నటించారు.