అలా స్నానం చేయలేక అమెరికాకి  డైరెక్టర్ చుట్టం గుడ్ బై ?

Blind Girl Rape In Madhya Pradesh

“సంస్కృతి, సంప్రదాయాల మధ్య తెరలు తొలిగిపోతున్నాయి..ప్రపంచమే కుగ్రామంగా మారిపోతోంది…పాశ్చాత్య ధోరణులు భారత్ లో పెరుగుతున్నాయి”…ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న డైలాగ్స్ . ఇందులో నిజముందని వేరే చెప్పక్కర్లేదు. ఆ స్టేట్ మెంట్స్ ని నిజం చేస్తూ రోజుకి ఓ ఘటన చూస్తూనే వున్నాం. కానీ అందుకు భిన్నంగా వున్న విషయం ఈ మధ్య బయటికి వచ్చింది . ఓ దర్శకుడి కుటుంబానికి చెందిన యువతి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిందట. అక్కడ యూనివర్సిటీ లో చేరింది. అయితే అక్కడ హాస్టల్ లో మిగిలిన అమ్మాయిలతో కలిసి స్నానం చేసే విధంగా ఏర్పాట్లు ఉండటంతో షాక్ అయ్యిందట. భారతీయ సాంప్రదాయాన్ని నిలువెల్లా నింపుకున్న ఆ అమ్మాయి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయిందట. దీంతో కొద్ది కాలంలోనే ఇంటికి తిరిగి వచ్చి ఇక అమెరికా వెళ్లబోనని భీష్మించుకు కూర్చుందట. తల్లిదండ్రులు, బంధువులు అడగ్గా అడగ్గా అసలు కారణం చెప్పిందట. దీంతో ఆ అమ్మాయికి ఎలా నచ్చజెప్పి తిరిగి చదువు కొనసాగేలా చేయడం మీద ఆ కుటుంబం దృష్టి పెట్టింది.
చూసేందుకు ఇది చిన్న విషయం లా అనిపిస్తున్నా సంస్కృతీ వైరుధ్యాల మధ్య యువత ఎంత నలిగిపోతోందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది ? ఈ సమస్య కి ఎలాంటి పరిష్కారం ఇవ్వాలో తెలియని సదరు దర్శకుడు కూడా ప్రపంచీకరణ ప్రభావం మీద తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. ఆ కోణంలో ఏమైనా కొత్త సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.