టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని తాజాగా ఈడీ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే పలువురు సినీతారలను విచారించిన ఈడీ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను సైతం పరిశీలించిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవలె కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ ఎక్సైజ్‌ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు మరోసారి ఈడీ విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలోనూ దర్యాప్తు చేయనుంది.