తెలుగు సినిమా నటుడు డియస్. దీక్షితులు కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. జూలై 28, 1956న హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో జన్మించిన ఆయన సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందిన ఆయన రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరు పనిచేశారు. లెక్చరరు ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి, హైదరాబాదు వెళ్లి ఏపీ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపర్టరీలో డిప్లోమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరిన ఆయన చాలా నాటకాలలో నటించి దర్శకత్వం వహించారు. అలా ఆయన నెమ్మదిగా టి.వి రంగంలో అడుగు పెట్టారు. ఆయన నటించిన ఆగమనం సీరియల్ లోని నటనకు నంది అవార్డులు వరించాయి. ఎల్లమ్మ, మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు లాంటి కొన్ని సినిమాల్లోనే నటించినా ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేసుకున్న ఆయన అనారోగ్యంతోనే కన్నుమూశారని సమాచారం. దీనికి సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.