Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతికి సినీ ఇండస్ట్రీని రప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ విషయంలో అసలు సినీ పెద్దలు ఏమనుకుంటున్నారో అని లోపాయికారీగా సమాచారం కూడా సేకరించింది. ఇండస్ట్రీ లో ముఖ్యులు అనుకున్న కొంతమంది అమరావతిలో స్టూడియోల నిర్మాణం కోసం స్ధలాలు ఇస్తే అక్కడకు వస్తామని చెబుతున్నారట. అయితే ముందు అమరావతిలో సినిమా షూటింగ్ సహా ఇతరత్రా యాక్టివిటీ మొదలు అయితే స్థలాలు ఇచ్చి ప్రోత్సహించడానికి ఇబ్బంది లేదని సర్కార్ అంటోంది. అయితే ముందుగా ఎవరు ఓ మెట్టు దిగాలి అన్నదాని మీద ప్రతిష్టంభన నెలకొంది.
సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నట్టు స్థలాలు ఇచ్చినప్పటికీ విశాఖలో సినీ రంగం ఇప్పటికీ ఏ మాత్రం కాలూనలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముందు అమరావతిలో ఏదో రకంగా సినిమా పరిశ్రమ కాలు పెడుతోంది అన్న ఇంప్రెషన్ కలగజేస్తే స్టూడియో నిర్మాణాలకు స్థలాలు ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదని సర్కార్ అంటోంది. అటు పరిశ్రమ పెద్దలు ముందుగా స్థలాలు ఇచ్చి పిలిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంలో వున్నారు. ఈ లంకె తెగడానికి ఎంత సమయం పడుతుందో ? అమరావతిలో రెడీ , స్టార్ట్ , యాక్షన్ అన్న మాటలు ఎప్పుడు వినపడతాయో?