టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో సినిమా హనుమాన్ జనవరి 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది . మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ కి సంబందించిన అనౌన్స్ మెంట్ ని చేయడం జరిగింది.
మహ మాస్ అప్డేట్ రేపు ఉదయం 11:07 గంటలకు రిలీజ్ కానున్నది . అయితే మహా మాస్ తో అంజనాద్రి ప్రతిధ్వనించేలా సెట్ చేయబడింది అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ అప్డేట్ తో హనుమాన్ మరింత హిస్టీరిక్ గా మారిపోతాడు అని పేర్కొన్నారు. ఈ బిగ్ అప్డేట్ తో ఆడియెన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.