Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Top 3 Chief Ministers List
దేశవ్యాప్తంగా పాపులర్ పీఎం అంటే ప్రధాని అని అందరికీ తెలుసు. ఆయనను ఢీకొనే మొనగాడు, దరిదాపులోకి వచ్చే సత్తా ఉన్న నేత గానీ ఎవరూ లేరు. అందుకే 2019 ఎన్నికలు మోడీకి నల్లేరుపై నడకేనని సర్వేలన్నీ తేల్చిచెబుతున్నాయి. కానీ పాపులర్ సీఎంల సర్వే మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉంది. ఎప్పట్నుంచో సీఎంలుగా చక్రాలు తిప్పుతున్న వారి కంటే.. నిన్న గాక మొన్న సీఎం అయిన వ్యక్తి టాప్ త్రీలో ఉండటం విశేషమే.
కొన్ని నెలల క్రితమే యూపీ సీఎంగా పీఠమెక్కిన యోగి ఆదిత్యనాథ్ టాప్ త్రీ ప్లేస్ ను కైవసం చేసుకున్నారు. ఇటీవలే ఎన్డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ రెండో స్థానంలో ఉన్నారు. మోడీ అంటే ఒంటికాలిపై లేచే దీదీ మమతా బెనర్జీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. బెంగాల్లో ఆమెకు విశేష ప్రజాదరణ ఉందని తేలిపోయింది. మోడీపై మమత విమర్శల్ని కూడా జనం స్వాగతిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు.. నాగంభొట్లుగా ఉంది. రాహుల్ గాంధీ అయితే అసలు పీఎం మెటీరియల్ కాదని జనం తేల్చేశారు. మరి ప్రియాంక వచ్చినా ఏమైనా ఉపయోగం ఉంటుందా.. అంటే చేయి దాటిపోయిందంటున్నారు. మరి చైనాతో యుద్ధాన్ని ఎక్కువమంది కోరుకోవడం లేదు. సరిహద్దు సమస్యల కంటే అంతర్గత చొరబాట్లే తలనొప్పిగా మారాయనే అభిప్రాయం వ్యక్తమైంది.