బాబాయ్‌ అబ్బాయ్‌ల సఖ్యత భేష్‌…!

Top Secret Reveals About Sr NTR And His Son Harikrishna

సినీ, రాజకీయ రంగంతో మంచి సంబంధాలున్న నందమూరి కుటుంబం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రాజకీయ నేపథ్యంలో ఈ కుటుంబంలో చీలికలు వస్తున్నాయని మీడియాలో కథనాలు వెలువడుతుంటాయి. పలు సినిమా కార్యక్రమాల సమయాల్లో అంత ఒకే వేదికపైకి వచ్చి తామంతా కలిసే ఉన్నట్టుగా క్లారిటీ ఇస్తారు. ఇటీవలె నందమూరి హరిక్రిష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సందర్భంగా తారక్‌, కళ్యాణ్‌ రామ్‌, బాలయ్య బాబుల మధ్య సఖ్యత కుదిరింది. ప్రస్తుతం బాలక్రిష్ణ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హరిక్రిష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్‌రామ్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే.

hari-krishna

రాజకీయ విషయాల పట్ల ఎన్టీఆర్‌ తనయుడు హరిక్రిష్ణతో చాలా రహస్య మంతనాలు నడిపేవారంటా! ఎన్టీఆర్‌ చైతన్యరథ సారథి హరిక్రిష్ణనే. రాజకీయాల్లో హరిక్రిష్ణ సలహాలని ఎన్టీఆర్‌ పాటించే వారని ఎన్టీఆర్‌ సన్నిహితులు చెబుతుంటారు. ఈ విషయాలన్ని కూడా ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో తెరపై చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ (బాలయ్యబాబు) తనయుడు హరిక్రిష్ణ (కళ్యాణ్‌రామ్‌) భుజంపై చేయి వేసి రహస్యంగా మాట్లాడుతున్న ఫొటో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది.

NTR-HARIKRISHNA

ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్‌… చిన్నప్పుడు బాబాయితో కలిసి ‘బాల గోపాలుడు’ చిత్రంలో నటించాను, ఇప్పుడు వాళ్ల నాన్నలా బాబాయ్‌, మా నాన్నలా నేను నటించడం చాలా సంతోషంగా ఉంది అంటున్నాడు. నందమూరి కుటుంబంలో కలహాలు అన్నీ తొలిగి కలిసే ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ వల్ల బాబాయ్‌ అబ్బాయ్‌ల సఖ్యత భేష్‌ అని నిరూపిస్తున్నారు.

ntr