మధురై రైల్వే స్టేషన్​ వద్ద రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య.

Train accident at Madurai railway station death toll reaches 10
Train accident at Madurai railway station death toll reaches 10

తమిళనాడులోని చెన్నై సమీపంలోని మధురై రైల్వే స్టేషన్​ వద్ద ఆగి ఉన్న పర్యటక​ రైలులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రైల్వే అధికారులకు ఈ ప్రమాదంపై సమాచారం అందగానే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనం కోసం ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్​ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్​కోయిల్​లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని శనివారం తెల్లవారుజామున రైలులో ముధురై చేరుకున్నారు. ఆ రైలు.. మధురై రైల్వే స్టేషన్​కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్​ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు.

టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఆ మంటలు రెండు కోచ్​లకు వ్యాపించాయి. కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగగా.. మరికొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు.