Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రా బస్సుల్ని అడ్డుకుని నానా రభస చేశారు టీఆర్ఎస్ నేతలు. అప్పట్లో ఎల్బీ నగర్ దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి వస్తున్న ఏపీ వాసుల బస్సుల్ని అడ్డుకుని దాడులు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజన తర్వాత అంతా ప్రశాంతంగా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ మళ్లీ కెలుకుడు మొదలెట్టాడు. ఏపీ నుంచి ఎన్ని బస్సులు హైదరాబాద్ వస్తే.. అన్నే బస్సులు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాలని రూల్స్ పెడుతున్నారు.
శ్రీనివాస్ గౌడ్ ఈ మధ్య కాలంలో పదవి లేకుండా ఖాళీగా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారనే టాక్ ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న ఆశించిన నామినేటెడ్ పదవి రాకపోవడంతో అప్ సెట్ అయ్యారని, అందుకే ట్రావెల్స్ రగడను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ శ్రీనివాస్ గౌడ్ చెబుతున్న రూల్ ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తెలంగాణ సర్కారు కూడా ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.
మరి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్న శ్రీనివాస్ గౌడ్.. మరోసారి హడావిడి చేయాలని చూస్తున్నారు. కానీ ఆయన సీన్ ఎంత అన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ఎపిసోడ్ తోనే తేలిపోయింది. అప్పట్లో జేసీని అలా అరెస్ట్ చేసి.. ఇలా వదిలేశారు పోలీసులు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, ఇది ఉద్యమ సమయం కాదని టీఆర్ఎస్ నేతలే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.