రియల్మీ ఎక్స్9, ఎక్స్9 ప్రో స్మార్ట్ ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. అయితే మొదట ఇవి చైనాలో లాంచ్ కానున్నాయి. RMX3366 మోడల్ నంబర్‌తో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను రియల్ మీ సీఎంవో ఫ్రాన్సిస్ వాంగ్ టీజ్ చేశారు. ఇది రియల్మీ= ఎక్స్9 ప్రో స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. అతని ట్వీట్ ప్రకారం ఇవి మనదేశంలో కూడా త్వరలో లాంచ్ కానున్నాయి.
వీబోలో దీనికి సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ షేర్ చేశారు. ఇది రియల్ మీ ఎక్స్9 స్మార్ట్ ఫోన్ అని తెలుస్తోంది. కానీ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. రియల్ మీ ఎక్స్9, రియల్ మీ ఎక్స్9 ప్రో స్మార్ట్ ఫోన్లు.. రియల్ మీ ఎక్స్50 ప్రో, రియల్ మీ వీ15లను రీప్లేస్ చేస్తున్నాయని సమాచారం.
ఇక ధర విషయానికి వస్తే.. రియల్మీ ఎక్స్9 ధర 2,000 యువాన్ల(సుమారు రూ.22,800) నుంచి 2,500 యువాన్ల(సుమారు రూ.28,500) మధ్య ఉండే అవకాశం ఉంది. రియల్మీ ఎక్స్9 ప్రో ధర 2,500 యువాన్ల(సుమారు రూ.28,500) నుంచి 3,000 యువాన్ల(సుమారు రూ.34,200) మధ్య ఉండే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు వచ్చిన లీకుల ప్రకారం.. రియల్మీ ఎక్స్9లో 6.55 అంగుళాల డిస్ప్లేను అందించనున్నారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 లేదా 4500 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. దీని మందం 0.8 సెంటీమీటర్లుగా ఉండనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించనున్నారు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్481 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్616 కెమెరాను అందించనున్నారు.
దీంతోపాటు రియల్ మీ ఎక్స్9 ప్రో స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. దీని ప్రకారం ఇందులో 6.55 అంగుళాల శాంసంగ్ ఈ3 అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 కెమెరాను అందించారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉండనున్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్616 సెన్సార్ కూడా ఇందులో ఉంది.