Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వర్కౌట్‌ు చేస్తున్న ఒక ఫొటో మరియు వీడియో తెగ వైరల్ అవుతుంది. కండలు పెంచిన ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. గత రెండు నెలలుగా తీవ్రంగా కష్టపడి ఎన్టీఆర్ ఏకంగా 12 కేజీల బరువు తగ్గినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. జైలవకుశతో పాటు అంతకు ముందు జనతాగ్యారేజ్ చిత్రాల్లో కాస్త బొద్దుగా మనోడు కనిపించాడు. ఇప్పుడు 12 కేజీల బరువు తగ్గడంతో ఎన్టీఆర్ మళ్లీ స్లిమ్‌గా కొత్త సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ఇకపై ఇదే పర్సనాలిటీని మెయింటెన్స్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న వర్కౌట్లు మరియు బరువు తగ్గడం ఏ చిత్రం కోసం అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రం ప్రారంభం కాబోతుంది. ఆ చిత్రం తర్వాత జక్కన్న దర్శకత్వంలో చరణ్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ ఏ చిత్రం కోసం బరువు తగ్గాడు అంటూ అభిమానులు కూడా అనుమానంను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు అనధికారికంగా స్పందిస్తూ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అందుకే ఆర్మీ పాత్రకు తగ్గట్లుగా బరువు తగ్గాడు అని, అలాగే ఇదే ఫిజిక్‌తో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.