కస్టమర్లు ఉపయోగించే సర్వీస్ ప్రొవైడర్, కాల్ అందుకున్న అవతలి వ్యక్తికి చెందిన సర్వీస్ ప్రొవైడర్ కి చెల్లించాల్సిన చార్జ్ “ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ ఐయూసీ“ (ఐయూసీ) అంటారు. ఆరు పైసలుగా నిర్దేశించింన ట్రాయ్ కాల్ కనెక్ట్ అయినపుడు మొదట కాల్ చేసే నెట్ వర్క్ రెండవ నెట్వర్క్ కు నిమిషానికి ఆరుపైసలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మధ్యే అవుట్ గోయింగ్ కాల్స్ కు రిలయన్స్జియో ఆరుపైసల చార్జి విధించింది. దీనిపై వచ్చిన ట్రోల్స్ కు జియో ఘాటైన సమాధానాలు ట్వీటర్ లో ఇచ్చింది.ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి ఆరుపైసలు చార్జీలు విధించగానే జియోను ఉపయోగించినవారు తిడుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేశారు. ప్రత్యర్థి కంపెనీలు కూడా సోషల్ మీడియా పోస్టుల ద్వారా జియోను ట్రోల్ చేశాయి. జియో కూడా ట్వీటర్ లో ప్రత్యర్థి మొబైల్ నెట్ వర్క్ లను ఉద్దేశిస్తూ “ఆ ఆరుపైసలను అడుగుతుంది మేము కాదంటూ” ట్వీట్లు చేసింది.
మరో ట్వీట్లో ఐడియా ను ఉద్దేశిస్తూ క్యాప్షన్ రూపంలో“జీరో ఐయూసీ,ఈఐడియా మీజీవితాన్నే మార్చేస్తుంది” ట్వీట్లో “నిమిషానికి ఆరు పైసలు,ఈ ఐడియా ఎందుకు సర్జీ?”అని ట్వీట్ చేసింది.ఎయిర్టెల్ మీద క్యాప్షన్ గా “ఈ టోల్ ను ఎవరు తీసుకుంటున్నారు?”అని అడుగుతూ,ట్వీట్లో “నిమిషానికి ఆరు పైసలు, ఎయిర్ టోల్” అని ట్వీట్ చేసింది. ఇలా ఐయూసీ పైన ఒకరిపైన ఒకరు కామెంట్ ట్రోల్స్ వెల్లువెత్తాయి.