మహాకూటమి కాదు మహాగందరగోళం – సిరిసిల్లలో కేటీఆర్ వ్యాఖ్యలు

KTR Fun On People Completing Simham Single Dialogue

తెలంగాణాలో డిసెంబర్ లో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి కి ధీటుగా తెరాస నేతల ప్రచారం వాడివేడిని సంతరించుకుంటుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు పర్యటిస్తూ, తమ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న కేటీఆర్ తాజాగా సోమవారం రోజున సిరిసిల్ల లో పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆర్ యం పి మరియు పి యం పి లను ఉద్దేశిస్తూ, “మహాకూటమి లో రాహుల్ గాంధీ సీట్లను, చంద్రబాబు నాయుడు నోట్లను పంచుతారని, తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవలసిన సమయం ఇదని, మహాకూటమిని తిప్పికొట్టి, తెలంగాణ ని అభివృద్ధి పథంలో నడపడానికి మీ ఓట్లే కీలకమని, ఎవరు తెలంగాణ ను పాలించాలో ప్రజలే నిర్ణయించుకోవాలని” తెలిపారు.

ktr

సిరిసిల్ల లోని ప్రజలను ఉద్దేశిస్తూ కేటీఆర్, ” కాంగ్రెస్ ముసలి నక్క, తెలుగుదేశం గుంట నక్క కలిసిపోయి కెసిఆర్ ను గద్దెదించాలని చూస్తున్నాయి. అయినప్పటికీ వాటి ఆటలు చెల్లవు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మహాకూటమి అనేది మహాగందరగోళ కూటమి. అందులోని ప్రతి పార్టీ, వారి వారి మేనిఫెస్టో లను ప్రకటిస్తుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు మహాకూటమి ఎంత గంధరగోళం లో ఉందో ” అని ప్రసంగించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ లో సీఎం పదవి అనేది ఒక మ్యూజికల్ చైర్స్ ఆట అని, ఎప్పుడూ ఎవరూ సీఎం గా మారుతారో వారికి కూడా తెలియదని విమర్శించారు. తెరాస పార్టీ కార్యక్రమాలను వివరిస్తూ ” తెరాస ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను నెలకొల్పడానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఆసుపత్రిలో కనీసం 10 పడకల ఐసీయూ యూనిట్లు ఖచ్చితంగా ఉంటాయని ” తెలిపారు.

ktr-speech

ప్రభుత్వ ఆసుపత్రులలో బ్లడ్ బ్యాంకులు, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన డయాగ్నొస్టిక్ మరియు డయాలిసిస్ సెంటర్లను నెలకొల్పడం ద్వారా ఆసుపత్రులలో చేరే ప్రజల సంఖ్యను క్రమంగా పెంచగలిగామని, కెసిఆర్ కిట్ల ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రులలో జరిగే ప్రసవాలు 30 నుండి 40 శాతం పెరిగాయని కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా, ప్రజలకు ఫస్ట్ ఎయిడ్ అందించడంలో మెడికల్ ప్రాక్టీషనర్లు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ktr-kcr