కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు విషయాలు చెప్పకుండా అందరినీ నోటికొచ్చినట్లు తిట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించడానికి బదులు రేవంత్.. ఇష్టమొచ్చినట్లుగా కేసీఆర్, ఆయన కుంటుంబంపై ఎలా పడితే అలా మాట్లాడారని దుయ్యబట్టారు. రేవంత్ ఎంత?…రేవంత్ బతుకెంత? అడ్డగోలుగా మాట్లాడితే తాటతీస్తాం. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు. దమ్ముంటే రేవంత్ విచారణ ఎదుర్కోవాలి. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. అనవసర వ్యాఖ్యలు చేస్తే రేవంత్ నాలుక కోస్తాం. కులాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఏజెంట్ రేవంత్‌రెడ్డి’’ అని బాల్క సుమన్ ఆరోపించారు.
కేసీఆర్ వేల ఎకరాల ఫామ్ హౌస్ చూపిస్తావా? లేకపోతే అక్కడే బొందపెట్టాలా. అడ్డగొలుగా మాట్లాడితే తాట తీస్తా. బాగా ఎగిరిపడుతున్నావ్. నీ గురించి ప్రధాని మోదీ, కేసీఆర్‌లు కలిసి ఐటీ దాడులు చేపిస్తారా? మా పఠాన్‌చెరువు ఎమ్మెల్యే, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. వారికి లెక్కల్లో తేడా ఉంటే.. నోటీసులిచ్చి సోదాలు చేస్తారు. దీనికి టీఆర్‌ఎస్‌కు ఏం సంబంధం. నీ గురించి ఎవరికి తెలియదు. ఎన్ని బ్లాక్‌మెయిల్ పనులు చేశావ్.. నీ దోస్తులను ఎలా మోసం చేశావో తెలియదనుకుంటున్నావా? నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన తెలంగాణలో, విషపు మొక్కలా చంద్రబాబు ఏజెంట్‌లా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నావ్. ‘అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం.. నువ్ బాగా బలిసి కొట్టుకుంటున్నవ్.. నువ్వో పెద్ద పీకుడుగానివీ, బొచ్చు గానివీ అని మోదీ, కేసీఆర్ కలిసి నీ మీద దాడులు చేయిస్తరా? నీతోని అయ్యేటిది ఎంత, పొయ్యేటిది ఎంత?’ అని సుమన్ మండిపడ్డారు. ‘నేను మాట్లాడటమే నీకు ఎక్కువ.. నువ్వో చిల్లరగాడివి.. లోఫర్, లఫూట్, క్యారెక్టర్‌లెస్ థర్డ్ గ్రేడ్ వ్యక్తివి.. నీకు బాల్క సుమనే ఎక్కువ. ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ చేసిన వ్యక్తిగా, ఓయూ విద్యార్థిగా, విలువలు, నీతి నిజాయతీతో ఉన్న వ్యక్తిగా, దేశంలోని 543 ఎంపీల్లో ఒకడిగా ఉన్న నేనే నీకు సమాధానం చెప్పడానికి ఎక్కువ. నీ మాటలపై ఇంక కేసీఆర్, కేటీఆర్ స్పందించాలా.. నువ్వు అంత పోటుగాడివా’ అని బాల్క సుమన్ దుయ్యబట్టారు.