కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు..! టిక్కెట్లు కోసమేనా…?

D Srinivas Meeting With Rahul Today

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. కష్టకాలంలో పార్టీని వీడిన పలువురు సీనియర్ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. వీరిలో దాదాపు అందరూ టిక్కెట్లు ఆశిస్తున్న వారే. ఈ రోజు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. డి.శ్రీనివాస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్‌, గజ్వెల్‌మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను టీఆర్‌ఎస్‌నుంచి సస్పెండ్‌చేయాలని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కానీ కేసీఆర్ సస్పెండ్ అయితే చేయలేదు కానీ డీఎస్ మాత్రం అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం మీద ఒక ప్ర్రేస్ మీట్ పెట్టి కూడా కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని మొతాన్ని విమర్శించినా సీఎం కేసీఆర్‌ సైతం జోక్యం చేసుకోకపోవడంతో డీఎస్‌ పార్టీ వీడక తప్పలేదు. చాలరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ లో చేరతారని భావించినా డీఎస్ రాకను కాంగ్రెస్‌పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు వ్యతిరేకిన్చాద్మ్తో ఇన్ని రోజులు ఆగిన ఆయన ఇప్పుడు తనకున్న పరిచయాలతో మార్గం సుగమం చేసుకున్నారు.

srinivasarao-congress
అయితే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అద్యక్ష్యుడిగా పనిచేసిన డీఎస్ ఇప్పుడు జిల్లా స్థాయి దాటి రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకూడదన్న షరతు మీద పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్సీ రాములు నాయక్.. కూడా టిక్కెట్ ఆశించి పార్టీలో చేరేతున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కూడా మెదక్ అసెంబ్లీ టిక్కెట్ ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లంతా టిక్కెట్ కోసం వచ్చిన వాళ్లే. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ మొదలుకుని అందరూ టిక్కెట్ల కోసమే పార్టీలో చేరారు.అయితే ఇప్పుడు ఒకపక్క తెలుగుదేశం, మరోపక్క టీజేఎస్, మరో పక్క సీపీఐ ఇలా అందరికీ సీట్లు ఇచ్చుకుంటూ వెళ్లి వీళ్ళకి టిక్కెట్లు సర్దుబాటు చేయగలరా..? అనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే టీఆరెస్ ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసింది. కానీ కాంగ్రెస్ సమేత మాహకూటమి ఇంకా చేయలేదు అక్కడ ఈ టిక్కెట్ల పంచాయతీ అయ్యాక అప్పుడు మరలా ఈ గోపీలు తమ ప్రతాపం చూపే అవకాశం ఉంది.

TRS-MP-D-Srinivas