ఇండియన్ ఐటీ కంపెనీలకి కి ట్రంప్ షాక్.

8-8

Posted [relativedate]

trump shock to indian it companies
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనీ చేశాడు.హెచ్ 1 బి వీసా దారులకి చెల్లిస్తున్న వేతనాల్ని రెట్టింపు చేసి ఇండియన్ ఐటీ కంపెనీలకి పెద్ద షాక్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన కొత్త వేతన చట్టాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుతో ఇప్పటిదాకా హెచ్ 1 బి వీసాదారులకు ఇస్తున్న వార్షిక కనీస వేతనం అరవై వేల డాలర్ల నుంచి 1 లక్షా 30 వేల డాలర్లకి పెరిగింది.ఈ బిల్లుతో పాటు అమెరికన్ ఉద్యోగాలని విదేశీ వర్కర్స్ తో భర్తీ చేసుకునే విధానం పై కూడా నిబంధనలు విధించారు.

హై స్కిల్ల్డ్ ఇంటెగ్రిటీ అండ్ ఫేర్ నెస్ యాక్ట్ 2017 పేరుతో తయారైన ఈ బిల్లుని కాలిఫోర్నియాకు చెందిన జో లోఫ్గ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.పైకి ఏమి చెప్పినా ఈ బిల్లు ఉద్దేశం హెచ్ 1 బి కోటాలో తక్కువ వేతన కేటగిరికి చెందిన ఉద్యోగులు రాకుండా నిరోధించడం …విదేశాల నుంచి ఉన్నత స్థాయిలో స్కిల్ల్డ్ ఉద్యోగులు మాత్రమే ,అది కూడా పరిమితంగానే వచ్చేట్టు నిరోధించడం.ఇబ్బడిముబ్బడిగా ఐటీ కంపెనీలు హెచ్ 1 బి వీసాదారుల కోసం అర్రులు చాచకుండా స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ..ఇలాంటి కఠిన ఉద్దేశాలతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు భారతీయ ఐటీ కంపెనీలకి షాక్ అనే చెప్పుకోవాలి.ఒక్కసారిగా హెచ్ 1 బి వీసాదారులకి జీతాలు రెట్టింపు చేయడం కంపెనీలకి భారంగా మారనుంది.