అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్ తగిలింది. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేశారని అభియోగం ఎదుర్కొంటున్న కేసులో ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ తిరస్కరించింది. మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని ఈ సందర్భంగా ఫెడరల్ కోర్టు జడ్జ్ తన్యా చుకుతాన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రంప్.. విచారణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేశారు.
పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి, ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈ సందర్భంగా జడ్జి తన్యా చుకుతాన్ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ మార్చిలో జరగనుండగా….తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తుండగా, అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయమైనందున విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.