ఇజ్రాయెల్​-హమాస్​ల మధ్య యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump's lead in Nikki Haley's home state.. Is the presidency certain again?
Trump's lead in Nikki Haley's home state.. Is the presidency certain again?

ఇజ్రాయెల్​-హమాస్​ల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ప్రపంచ దేశాలు ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. కొన్ని దేశాలు ఇజ్రాయెల్​ వైపు.. మరికొన్ని దేశాలు పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతున్న వేళ ఈ పరిస్థితులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం విధిస్తానని ప్రకటించారు.

మొదటిసారి తాను తీసుకువచ్చిన ముస్లింల నిషేధాన్ని మరింతగా విస్తరిస్తానని ట్రంప్ వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమెరికా వచ్చే వారి ఆలోచనలు, సిద్ధాంతాలను ఇమ్మిగ్రేషన్​లో పరీక్షిస్తామని.. హమాస్​, ముస్లిం ఉగ్రవాదుల సానుభూతిపరులను దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని తేల్చి చెప్పారు. యూఎస్​లో ప్రమాదకరమైన ద్వేషం, మూర్ఖులను అనుమతించబోమని.. ఇస్లామిక్, హమాస్​ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారు పాలించేందుకు అనర్హులవుతారని స్పష్టం చేశారు. అమెరికా ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు.. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.