శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది. దింతో శిరీష అలియాస్ బర్రెలక్క విషయం ఆమె నామినేషన్ వేసినప్పటి నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో బర్రెలక్క కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలైంది.
అయితే, కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఊరు…. పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయ్యింది. బర్రెలను కాసే ఓ అమ్మాయి ఎంత పాపులర్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోయారు” అని ఆర్జీవి కామెంట్ చేశారు. దీనిపై బర్రెలక్క తరపున ఆమె లాయర్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.