నేటి నుంచి అసెంబ్లీ నియోజకర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను ఈ సందర్భంగా స్వీకరించనున్నారు ముఖ్య నాయకులు.
ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు టీ హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరుకానున్నారు.
జనవరి 27
సిద్దిపేట – హరీశ్ రావు
బోథ్ – దేశపతి శ్రీనివాస్
జూబ్లీహిల్స్ – కేటీఆర్
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నల్లగొండ – కడియం శ్రీహరి
జనవరి 28
మెదక్ – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
సిరిసిల్ల – కేటీఆర్, దేశపతి శ్రీనివాస్
ముషీరాబాద్ – ఎల్ రమణ
పాలకుర్తి – హరీశ్ రావు
జనవరి 29
ఆలేరు – మధుసూదనాచారి
నర్సంపేట – దేశపతి శ్రీనివాస్,
ఖైరతాబాద్ – వేముల ప్రశాంత్‌రెడ్డి
జగిత్యాల – హరీశ్ రావు
వికారాబాద్ – కేటీఆర్
జుక్కల్ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి
వర్ధన్నపేట – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
చేవేళ్ల – కేటీఆర్