TS Politics: తెలంగాణ ప్రజలందరికీ గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

TS Politics: CM Revanth Reddy gave good news to all Telangana people
TS Politics: CM Revanth Reddy gave good news to all Telangana people

తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు.

“అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని. అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే నా లక్ష్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతాం. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33% హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్నాయి” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.