TS Politics: దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. బస్సులు దగ్ధం..

TS Politics: Fire accident at Dilsukhnagar RTC depot.. Buses burnt..
TS Politics: Fire accident at Dilsukhnagar RTC depot.. Buses burnt..

ఇవాళ తెల్లవారుజామున దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులకు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోగా, మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇక, బస్సులకు మంటలు అంటుకున్న నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఇక, సమయానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రమాద సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది అని డిపో అధికారులు తెలిపారు.