తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. రూ. 400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయనుంది. ఇందులో 80 కొత్త బస్సులు ఈరోజు ప్రారంభం కానున్నాయి. వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభిస్తారు.
కొత్త బస్సుల్లో 30 రాజధాని ఏసీ, 30 ఎక్స్ప్రెస్, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) ఉన్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ బస్సులన్నీ విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది.