డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు మండల జిల్లా కేంద్రాల్లో ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించనుంది.
వారికి విద్యార్థులు పోలీసుల యూనిఫామ్, కుట్టు పనులను అప్పగించాలని….. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దీనితోపాటు రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్ పథకం అమలులో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని ఆలోచిస్తుంది.
కాగా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వినియోగదారులు గత ఏడాది వినియోగించిన విద్యుత్తు లెక్కలను పరిగణలోకి తీసుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిన్న ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్ తో పాటు రూ. 500కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై మార్గదర్శకాలు రూపొందించి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.