నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారికి అభినందనలు తెలుపుతూ తీర్మానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానం చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాదని చెప్పారు. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆరెస్ కు బుద్ది రాలేదు..నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని తెలిపారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుందని…బీఆరెస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్.