35 వేల కోట్లతో కట్టాలనుకున్నాం.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు పెంచారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను వివరించారు.
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని అన్నారు. మేడిగడ్డ.. అన్నారం..సుందిళ్ళ పై మేము చెప్తున్నా విషయాలు నిజం అయ్యాయన్నారు. లక్షల కోట్లు అప్పు..పదుల కోట్లు బిల్లులు బకాయిలో ఉన్నాయని చెప్పారు. మరి ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏంటి అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కోసం అప్లై చేసినా అన్నది అప్పటి ప్రభుత్వం….ప్రొఫార్మ ప్రకారం పంపలేదు అని కేంద్రం చెప్పిందని ఆగ్రహించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.