తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ విద్యార్థి జేఏసీ తాజాగా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించింది. సోమవారం నుంచి నిరసనలకు దిగాలని నిర్ణయించింది. ఈనెల 14న మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రకటించింది. అలాగే 16న ఓయూలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ పేర్కొంది. 19న విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెవెన్యూ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది.