Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకటేశ్వర స్వామి పవర్ ఫుల్ గాడ్ అని అందరికీ తెలుసు. ఆయన మీద మాట తూలితేనే చెడు జరుగుతుందని దేశవ్యాప్తంగా నమ్మకం ఉంది. అలాంటి స్వామి సన్నిధిలో కొందరు అధికారులు మాత్రం చెలరేగిపోతున్నారు. అయిన కాడికి దోచుకుంటూ సామాన్యుల్నే కాదు వీఐపీల్ని కూడా విసిగిస్తున్నారు. ఏకంగా కేంద్రమంత్రి ఓ చిరుద్యోగిపై ఫిర్యాదు చేసినా.. టీటీడీ చర్యల్లేవంటే తిరుమలలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
దేవుడి దర్శనం కంటే పూజారి దయ ఉండాలని పెద్దలంటారు. ఇప్పుడు తిరుమలలో అంతకు మించి నడుస్తోంది. భక్తుల్ని, పూజారుల్ని అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు కొందరు అధికారులు. తామే స్వామికి కూడా యజమానుల్లా వ్యవహరిస్తూ పాపాన్ని కొనితెచ్చుకుంటున్నారు. అసలు సదరు అధికారుల తీరు చూసి.. స్వయంగా టీడీడీ సభ్యులే ఆశ్చర్యపోయి సందర్భాలున్నాయి.
ఇంత జరుగుతున్నా వారిపై ఈగ వాలదు. ఎందుకంటే స్థానబలం. మొసలికి నీటిలో ఉన్నంతసేపూ అందరి కంటే ఎక్కువ బలం ఉంటుంది. ప్రస్తుతం కొండ మీద ఉద్యజోగుల పరిస్థితి కూడా ఇదే. ఎవరేం చెప్పినా లెక్కచేయకుండా, కనీసం బదిలీ ఉత్తర్వులు కూడా తీసుకోకుండా ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు. మరి వీరికి అడ్డుకట్ట వేయడానికి దేవుడే దిగిరావాలేమో.
మరిన్ని వార్తలు
నంద్యాల ఎలక్షన్ షెడ్యూల్ ఇదే.
జనసేన పేరిట వసూళ్లు… పవన్ అలర్ట్.
ఆంధ్రజ్యోతి పై ఆర్కే పరువునష్టం దావా .