ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ ని సంతరించుకొని సాలిడ్ ప్రమోషన్స్ జరుపుకుంటూ రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ సినిమా “మంగళవారం” కోసం అందరికీ తెలిసిందే.
మరి ఈ సినిమా ని మేకర్స్ అయితే ఒక రేంజ్ లో హైప్ ని ఎక్కిస్తుండగా ఈ సినిమా పై సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా ఒకొకటిగా బయటకి వస్తున్నాయి. మరి అలా ఈ మూవీ బడ్జెట్ కి సంబంధించి కూడా దర్శకుడు రివీల్ చేసాడు. దీనితో ఈ సినిమా కి 20 కోట్లు బడ్జెట్ అయ్యినట్టుగా తాను తెలిపారు.
మరి రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ తరహా సినిమా ల్లో ఇది ఎక్కువ బడ్జెట్ తోనే వస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతలో కూడా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టుగా కనిపించట్లేదు . ఇక ఈ సినిమా కి మధుర మీడియా వర్క్స్ వారు నిర్మాణం వహించగా ఈ నవంబర్ 17న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.